రెండో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్న నేహా ధూపియా
- 2017లో అంగద్ బేడీని పెళ్లాడిన నేహా ధూపియా
- అదే ఏడాది మెహర్ అనే బిడ్డకు జన్మనిచ్చిన సినీనటి
- బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేసిన వైనం
సినీ నటుడు, మోడల్ అంగద్ బేడీని 2017 మే నెలలో ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కుమారుడే అంగద్ బేడీ. అదే సంవత్సరం నవంబర్ లో మెహర్ అనే బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు... 'పరమవీరచక్ర', 'విలన్', 'నిన్నే ఇష్టపడ్డాను' వంటి తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించారు.