అమిత్ షాకు రాష్ట్ర పరిస్థితులను వివరించాం: ఈటల రాజేందర్
- అమిత్ షాతో భేటీ అయిన బండి సంజయ్, ఈటల
- తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని అమిత్ షా చెప్పారన్న ఈటల
- హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీనే అని ధీమా
భేటీ అనంతరం మీడియాతో ఈటల మాట్లాడుతూ, రాష్ట్ర పరిస్థితులను అమిత్ షాకు వివరించామని చెప్పారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని అమిత్ షా చెప్పారని అన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నిసార్లు అయినా రాష్ట్రానికి వస్తానని తెలిపారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఎంత డబ్బు ఖర్చు చేసినా హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీనే అని అన్నారు. మరోవైపు అమిత్ షాను బండి సంజయ్, ఈటలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ కూడా కలిశారు.