తొలి డోసు ఒక వ్యాక్సిన్.. రెండో డోసు మ‌రొక‌టి వేయించుకోవ‌ద్దు: డ‌బ్ల్యూహెచ్‌వో

13-07-2021 Tue 13:31 | Science
  • ఇప్ప‌టికే రెండు వేర్వేరు టీకాలు వేయించుకున్న పలు దేశాల అధినేతలు
  • డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్ ఆందోళ‌న
  • ఇలా వ్యాక్సిన్లను వాడితే ప్రమాదకరమని హెచ్చ‌రిక‌
  • వ్యాక్సిన్ల కాంబినేషన్‌పై ఇప్ప‌టివ‌ర‌కు సరైన డేటా అందుబాటులో లేద‌ని వ్యాఖ్య  
క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు వ్యాక్సిన్ల‌ను అభివృద్ధి చేశాయి. ఈ నేప‌థ్యంలో మొద‌టి డోసు ఓ సంస్థ‌కు చెందిన వ్యాక్సిన్ వేసి రెండో డోసు మ‌రో వ్యాక్సిన్ వేసినా మంచి ఫ‌లితం ఉంటుంద‌ని ప‌లువురు నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పలు దేశాల అధినేతలు కూడా రెండు వేర్వేరు టీకాలు వేయించుకున్నారు.

అయితే, ఈ తీరుపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలా వ్యాక్సిన్లను వాడితే ప్రమాదకరమని హెచ్చ‌రించారు. క‌రోనా వ్యాక్సిన్ల కాంబినేషన్‌పై ఇప్ప‌టివ‌ర‌కు సరైన డేటా అందుబాటులో లేద‌ని చెప్పారు. అంతేగాక‌, ప్రజలే సొంతంగా ఏ వ్యాక్సిన్‌ తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో నిర్ణయించుకోవడం ఆందోళనకరమైన విష‌య‌మ‌ని తెలిపారు.

కాగా, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్ మొద‌టి డోసు  ఆస్ట్రాజెనెకా సంస్థ‌కు చెందిన వ్యాక్సిన్ వేయించుకుని, రెండో డోసు మాత్రం మోడెర్నా సంస్థ‌కు చెందింది వేయించుకున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి  కూడా వేర్వేరు వ్యాక్సిన్ల‌ను వేయించుకుని ఈ విధానాన్ని ప్రోత్స‌హించారు.

కెనడా, యూకే, యురోపియ‌న్ యూనియ‌న్ లోని ప‌లు దేశాలు, స్పెయిన్, ద‌క్షిణ కొరియా కూడా ఇటువంటి విధానాన్ని అవ‌లంబిస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తర్వాత సమస్యలను తప్పించేందుకు ఈ విధానాన్ని పాటిస్తున్న‌ట్లు ఆయా దేశాలు చెప్పాయి.
WHOvaccineCovishield

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more