ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల్లో మ‌రిన్ని సడ‌లింపులు

12-07-2021 Mon 13:08 | Andhra
  • కరోనాపై అధికారుల‌తో ఏపీ సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌
  • పాల్గొన్న బొత్స‌, ఆళ్ల‌ నాని
  • అన్ని జిల్లాల‌కు ఒకే విధంగా క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు
  • రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ  
క‌రోనాపై మంత్రులు ఆళ్ల‌ నాని, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు ప‌లువురు అధికారుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌పై ఆయ‌న చ‌ర్చిస్తున్నారు. రాష్ట్రంలో కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై ఆయ‌న వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఏపీలో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను మ‌రింత స‌డ‌లించే అంశంపై నిర్ణ‌యం తీసుకున్నారు.  

రాష్ట్రంలో అన్ని జిల్లాల‌కు ఒకే విధంగా క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ ఉండ‌బోదు. రాత్రి 9 గంట‌లకు అన్ని దుకాణాలు మూసి వేయాల్సి ఉంటుంది.

దుకాణాల్లో సిబ్బందితో పాటు కొనుగోలుదారులు మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేశారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే దుకాణాల‌కు భారీ జ‌రిమానా విధించ‌నున్నారు. ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించ‌క‌పోతే రూ.100 జ‌రిమానా నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లు చేయ‌నున్నారు.
CurfewAndhra PradeshJagan

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more