స్టాన్ స్వామి మృతి నేపథ్యంలో రాష్ట్రపతికి లేఖ రాసిన విపక్ష నేతలు
- నిన్న ముంబయిలో స్టాన్ స్వామి మృతి
- గుండెపోటుతో కన్నుమూత
- బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న స్టాన్ స్వామి
- తప్పుడు కేసులు పెట్టారన్న విపక్ష నేతలు
ఈ లేఖపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా సంతకాలు చేశారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరో రాష్ట్రపతి తేల్చాలని స్పష్టం చేశారు.