శునకంపై క్రూరత్వం... ఇద్దరు మహిళల అరెస్ట్!
- పంజాబ్ లోని పాటియాలాలో ఘటన
- శునకాన్ని లాక్కెళ్లిన ఇద్దరు
- తీవ్రంగా స్పందించిన జంతు ప్రేమికులు
వీరిద్దరినీ పాటియాలా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన చంచల్, సోనియాగా గుర్తించామని, వారు ఓ కుక్కను వాహనానికి కట్టేసి లాక్కెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు.
జంతువులపై క్రూరత్వాన్ని చూపినందుకు వారిని అదుపులోకి తీసుకున్నామని, ఆపై బెయిల్ మీద వారు విడుదల అయ్యారని పోలీసులు తెలిపారు. కాగా, ఆ శునకం తీవ్రగాయాలపాలై మరణించడం జంతు ప్రేమికులను కలవరపరిచింది.