Kathi Mahesh: లారీని ఢీ కొన్న కారు.. క‌త్తి మ‌హేశ్‌కు గాయాలు

kathi mahesh meets with accident
షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్‌కు రోడ్డు ప్ర‌మాదంలో స్వ‌ల్ప‌ గాయాల‌య్యాయి. ఇన్నోవా కారులో నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయ రహదారిపై ఆయ‌న‌ ప్రయాణిస్తున్న స‌మ‌యంలో అది ఓ లారీని ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న మ‌హేశ్‌కు గాయాలు కావ‌డంతో ఆయ‌న వెంట‌నే నెల్లూరు మెడికేర్ ఆసుప‌త్రిలో చేరారు.

ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో కత్తి మహేశ్ కారు ధ్వంస‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. బిగ్‌బాస్ సీజ‌న్ 1 ద్వారా క‌త్తి మ‌హేశ్ కు మంచి గుర్తింపు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప‌లు సినిమాల్లోనూ ఆయ‌న న‌టించారు.
Go Back to Shorts
Kathi Mahesh
Tollywood
Nellore District

More Telugu News