కోహ్లీ, పుజారా నిలబడుంటే డ్రా చేసుకునే అవకాశం ఉండేది: సచిన్
- సౌతాంప్టన్ లో భారత్, కివీస్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్
- విజేతగా నిలిచిన న్యూజిలాండ్
- కోహ్లీ, పుజారా వెంటవెంటనే అవుటయ్యారన్న సచిన్
- భారత జట్టుపై ఒత్తిడి పెరిగిపోయిందని వెల్లడి
ఆటకు చివరి రోజున తొలి సెషన్ ఎంతో కీలకమని తాను ముందే చెప్పానని అన్నాడు. కోహ్లీ, పుజారా వెంటవెంటనే అవుట్ కావడంతో జట్టు ఒత్తిడికి గురైందని, ఆపై వరుసగా వికెట్లు కోల్పోయిందని ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో విశ్లేషించాడు. ఇక, మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో విజేతగా అవతరించిన న్యూజిలాండ్ జట్టుకు సచిన్ శుభాకాంక్షలు తెలియజేశాడు.