హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పీవీ విగ్రహం... ఈ నెల 28న ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
- తెలంగాణలో పీవీ శతజయంతి ఉత్సవాలు
- దివంగత మాజీ ప్రధానికి విశిష్ట గౌరవం
- 26 అడుగుల ఎత్తుతో భారీ విగ్రహం
- రూ.27 లక్షల వ్యయంతో విగ్రహం
- ఇకపై పీవీఎన్ఆర్ మార్గ్ గా నెక్లెస్ రోడ్
ఈ విగ్రహం ఎత్తు 26 అడుగులు కాగా, 2 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని రూ.27 లక్షల వ్యయంతో రూపొందించారు. ఈ విగ్రహం తయారీలో పలు లోహాలను ఉపయోగించారు. కాగా, పీవీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న నెక్లెస్ రోడ్డు పేరు మార్చారు. ఇకపై నెక్లెస్ రోడ్డును పీవీ నరసింహారావు మార్గ్ గా పిలవనున్నారు. పీవీ విగ్రహం నెలకొల్పే ప్రాంతం చుట్టూ అర ఎకరం మేర అందంగా ముస్తాబు చేయనున్నారు.