దేశాన్ని డిజైనింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం: ఆనంద్ శర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశాన్ని డిజైనింగ్ హబ్ గా తీర్చిదిద్దుతాం: ఆనంద్ శర్మ

దేశాన్ని డిజైనింగ్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖా మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. రానున్న ఐదేళ్ళలో పదిహేనువేల క్రాఫ్ట్ డిజైనర్లను తయారు చేస్తామని తెలిపారు. గచ్చిబౌలిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ భవనానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రమంత్రి పల్లంరాజు శంకుస్థాపన చేసారు. జాతీయ సంస్థల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అనువైన స్థలమన్నారు కేంద్రమంత్రి ఆనంద్ శర్మ. చిత్తూరు, మెదక్ జిల్లాలకు మంజూరైన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ తో పాటు మరో జోన్ ను ఒంగోలులో ఏర్పాటుచేయాలని సీఎం కోరారు. దీనికి స్పందించిన మంత్రి భూమి లభ్యతను అంచనా వేసుకుంటే మరోటి కేటాయించేందుకు తమకెలాంటి అభ్యంతరమూ లేదన్నారు.

More Telugu News