అంజయ్యా.. నేను మీ ఊరికి వస్తున్నా!: వాసాలమర్రి గ్రామ సర్పంచికి సీఎం కేసీఆర్ ఫోన్

18-06-2021 Fri 16:49 | Telangana
  • ఈ నెల 22న యాదాద్రి జిల్లాలో కేసీఆర్ పర్యటన
  • వాసాలమర్రి గ్రామానికి రాక
  • గ్రామంలో సామూహిక భోజనాలకు కేసీఆర్ ఆసక్తి
  • సర్పంచి అంజయ్యకు దిశానిర్దేశం
  • భోజనాల అనంతరం భారీ సభ
సీఎం కేసీఆర్ ఈ నెల 22న యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి రానున్నారు. తుర్కపల్లి మండలంలో ఉన్న ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వాసాలమర్రి గ్రామంలో పర్యటించేందుకు నిర్ణయించుకున్న సీఎం కేసీఆర్ గ్రామ సర్పంచి అంజయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. తాను పర్యటనకు వస్తున్నానని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఫోన్ కాల్ ద్వారా సంభాషణ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇవిగో...

సీఎం కేసీఆర్: నమస్తే అంజయ్య, బాగున్నావా?

సర్పంచి: నమస్తే సార్... బాగున్నాను సార్!

సీఎం కేసీఆర్: అంజయ్యా... నేను ఈ నెల 22 మీ ఊరికి వస్తున్నా. కొన్నిరోజుల ముందు రావాలనుకున్నాను కానీ... ఈ లోపున నాకు కరోనా వచ్చి, దేశమంతా కరోనా వచ్చి రాలేకపోయాను. గతంలో వస్తానని మాటిచ్చాను కాబట్టి వస్తున్నాను.

సర్పంచి: తప్పకుండా రండి సార్!

సీఎం కేసీఆర్: ఈ నెల 22న వస్తున్నాను. అయితే నువ్వు మీ ఊర్లో రెండు ప్రదేశాలు చూడాలి. ఒకటి మీ ఊరు వాళ్లందరితో కలిసి నేను భోజనం చేసేందుకు జాగా చూడాలి. రెండోది నా సభకు అనువైన స్థలం చూడాలి. ఈ రెండు స్థలాలను నువ్వు ఎంపిక చేయాలి.

సర్పంచి: అలాగే సార్.

సీఎం కేసీఆర్: అంజయ్యా... మీ ఊర్లో ఎంత మంది జనాభా ఉంటారు?

సర్పంచి: 2,600 మంది ఉంటారు సార్.

సీఎం కేసీఆర్: నేను వచ్చిన రోజున వారందరికీ భోజనం పెడుతున్నాం. భోజనం ఏర్పాట్లకు హైదరాబాద్ నుంచి ముందే ఓ టీమ్ వస్తుంది. వాళ్లకు నువ్వు స్థలం చూపించాలి. ఇక నాతో పాటు 200 మంది వస్తారు. పోలీసులు ,ఇతర సిబ్బంది అందరికీ కలిపి భోజనం ఏర్పాటు చేయిద్దాం. అదంతా నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడొద్దు. కలెక్టర్ వచ్చి అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తారు. నువ్వు చేయాల్సింది భోజనానికి, నా సభకు రెండు జాగాలు చూపించాలి. ఈ రెండు జాగాల్లో రెయిన్ ఫ్రూఫ్ టెంట్లు వేయించాలి. ఆ ఏర్పాట్లు కలెక్టర్ చూసుకుంటారు.

సర్పంచి: అలాగే సార్.

సీఎం కేసీఆర్: కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా ఈ భోజనాలు ఉంటాయి.. వాళ్లందరితో కూర్చుని నేను కూడా భోజనం చేస్తాను.

సర్పంచి: అలాగే సార్. ఊరి బయట హాస్టల్ వద్ద ఓ వ్యక్తికి చెందిన 30 ఎకరాల స్థలం ఉంది సార్. అందులో భోజనాలు పెడదాం. అక్కడైతే మీతో పాటు వచ్చేవారికి ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్.

సీఎం కేసీఆర్: అలాగే కానివ్వు అంజయ్యా. అయితే, భోజనాలు చేసే స్థలానికి, సభ ఏర్పాటు చేసే స్థలానికి దూరం ఉండాలి. నా వరకైతే ఇబ్బంది లేదు. బాత్రూం గట్రా ఉండే బస్సు కూడా నాతో వస్తుంది.

సర్పంచి: అలాగే సార్. నాదో రిక్వెస్టు సార్. వాసాలమర్రి వస్తున్న మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి సార్. ఒకప్పుడు రెండు పూటల తిండికి కూడా నోచుకోని మేం మీ జెండాతోనే ఎదిగాం. మా కుటుంబానికి మీ ఆశీస్సులు కావాలి సార్.

సీఎం కేసీఆర్: తప్పకుండా వస్తా అంజయ్యా. భోజనాలు అయ్యాక మీ ఇంటికి వెళదాం. భోజనం చేసిన జనాలు అక్కడి నుంచి సభ ఏర్పాటు చేసిన స్థలానికి హ్యాపీగా వెళతారు. మీ ఇంటి వద్ద ఓ ఐదు నిమిషాలు గడిపి మనం కూడా సభకు వెళదాం.

సర్పంచి: థాంక్యూ సార్.

సీఎం కేసీఆర్: ఈ పర్యటనలో ఎలాంటి చిల్లర రాజకీయాలు ఉండవు. అందరినీ కలుపుకుని పోవాలి.

సర్పంచి: నాకు అలాంటివేమీ లేవు సార్.

సీఎం కేసీఆర్: నీక్కాదు నేను చెప్పేది. అందరికీ. వేరే పార్టీ వాళ్లను కూడా కలుపుకుని పోవాలి.

సర్పంచి: ఓకే సార్.

సీఎం కేసీఆర్: సర్పంచిగా బాగా కష్టపడి పనిచేయి! మంచి పేరొస్తుంది.

సర్పంచి: తప్పకుండా సార్. మీ ఆశీస్సులతో బాగా పనిచేస్తాను సర్.
KCRVasalamarriSarpanchAnjaiahTourYadadri Bhuvanagiri District

More Telugu News

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35
..more