జస్టిస్ లోథా సిఫారసుల మేరకే అజారుద్దీన్ కు నోటీసులు: అపెక్స్ కౌన్సిల్
- హెచ్ సీఏ అధ్యక్షుడు అజర్ పై వేటు
- అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం
- కౌన్సిల్ నిర్ణయాన్ని అంగీకరించని అజర్
- చట్టవిరుద్ధమని వ్యాఖ్యలు
- అజర్ ఇప్పుడు మాజీ అధ్యక్షుడన్న కౌన్సిల్
జస్టిస్ లోథా సిఫారసుల మేరకే అజారుద్దీన్ కు నోటీసులు ఇచ్చామని స్పష్టం చేసింది. కౌన్సిల్ లోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఈ వ్యవహారంలో బీసీసీఐ జోక్యం ఉండదని తెలిపింది. నేటి నుంచి అజారుద్దీన్ హెచ్ సీఏ అధ్యక్షుడు కాదని అపెక్స్ కౌన్సిల్ స్పష్టత నిచ్చింది. అయితే, హెచ్ సీఏ సమావేశాలకు అజారుద్దీన్ అధ్యక్షుడిగా కాకుండా వ్యక్తిగత హోదాలో హాజరుకావొచ్చని సూచించింది.