విశాఖ అడవుల్లో ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోల మృతి
- కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్
- హెలికాప్టర్ సాయంతోనూ గాలింపు చర్యలు
- అదనపు బలగాల సైతం తరలింపు
ఆ ప్రాంతంలో ఉదయం నుంచి కూంబింగ్ కొనసాగుతోంది. హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడికి అదనపు బలగాలను సైతం తరలిస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. అంతేగాక, సరిహద్దులో వాహన తనిఖీలనూ ముమ్మరం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఏకే- 47, తుపాకులు లభ్యమయ్యాయని పోలీసులు చెప్పారు.