Viral Videos: మార్కెట్‌లో కాల్పులు జ‌రిపిన ఆరుగురు దుండ‌గులు.. వీడియో ఇదిగో

  • రాజ‌స్థాన్‌లో ఘ‌ట‌న‌
  • ఓ దుకాణ య‌జ‌మానే ల‌క్ష్యంగా కాల్పులు
  • త‌ప్పించుకోగ‌లిగిన బాధితుడు
  6 bike borne men fired bullets at a shop in the fruits vegetable marke

రాజ‌స్థాన్‌లో ర‌ద్దీగా ఉండే ఓ మార్కెట్‌లో కొంద‌రు దుండ‌గులు తుపాకీతో కాల్పులు జ‌రిపి క‌ల‌క‌లం రేపారు. కోట జిల్లాలోని గుమ‌న్‌పురాలో పండ్లు, కూర‌గాయ‌ల మార్కెట్‌లోకి రెండు బైకుల‌పై వ‌చ్చిన‌ ఆరుగురు యువ‌కులు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. మార్కెట్‌లో ఓ దుకాణ య‌జ‌మానే ల‌క్ష్యంగా కాల్పులు జ‌రిపారు.  

అయితే, దుకాణ య‌జ‌మాని లోపలికి వెళ్లి తుపాకీ తూటాలు తాక‌కుండా త‌ప్పించుకోగ‌ల‌గడంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ప‌లు రౌండ్లు కాల్పులు జ‌రిపిన ఆ దుండ‌గులు అనంత‌రం అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్త‌మ‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ను ప‌రిశీలిస్తున్నారు. కాల్పులు జ‌రిపిన వారి కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు.

More Telugu News