ప్రాంతీయ పార్టీల్లోనే పోటీ.. అవి బీజేపీని ఢీకొట్టలేవు: అసోం సీఎం
- జాతీయ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావు
- కాంగ్రెస్ ముక్త్ భారత్ త్వరలోనే సాకారం
- దేశాన్ని కాపాడే వారికే ప్రజలు ఓటేస్తారు
దేశంలో కాంగ్రెస్ ఏ మాత్రమూ ప్రత్యామ్నాయం కాబోదని, ప్రాంతీయ పార్టీలే అవుతాయంటూ చాలా మంది వామపక్ష ఉదారవాదులు చెబుతూ వస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ అతి త్వరలోనే సాకారమవబోతోందన్నారు. అయితే, ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల గురించి చర్చ జరుగుతున్నా అది సాధ్యం కాదన్నారు. ఉదాహరణకు బెంగాల్, బీహార్ లు కలవలేవని, అదే విధంగా బెంగాల్, అసోంలకూ పొంతన కుదరదని అన్నారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఏకమైనా బీజేపీ హవాను తగ్గించలేవన్నారు.
అక్కడక్కడా లీడర్లు ఎదిగినా.. జాతీయ రాజకీయాలకు వచ్చే సరికి మాత్రం వారు ప్రభావం చూపించలేరని అన్నారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఎల్లప్పుడూ రక్షించే వారికే ప్రజలు ఓటేస్తారని ఆయన పేర్కొన్నారు.