పవన్ తో త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ!

Trivikram Pan India movie with Pavan kalyan
  • త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ కి క్రేజ్
  • ఇద్దరి ఖాతాలో రెండు భారీ హిట్లు
  • మరో ప్రాజెక్టును సెట్ చేస్తున్న త్రివిక్రమ్
  • హ్యాపీగా ఫీలవుతున్న అభిమానులు
త్రివిక్రమ్ .. పవన్ కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉంది.  'జల్సా' .. 'అత్తారింటికి దారేది' వంటి భారీ హిట్లు ఈ కాంబినేషన్లో వచ్చాయి. 'అజ్ఞాతవాసి' ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రావాలనే అభిమానులు కోరుకుంటున్నారు. మరో రెండేళ్లలో వాళ్ల ముచ్చట తీరనుందనే చెప్పొచ్చు. పవన్ కథానాయకుడిగా త్రివిక్రమ్ మరో ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్టుగా ఒక వార్త ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావడమనేది ఖాయమనే చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం క్రిష్ .. సాగర్ చంద్ర ప్రాజెక్టులతో పవన్ బిజీగా ఉన్నారు. ఆ తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో చేయనున్నారు. ఈ లోగా మహేశ్ బాబు మూవీని త్రివిక్రమ్ పూర్తిచేయనున్నాడు. ఆ తరువాత పవన్ - త్రివిక్రమ్ కలిసి సెట్స్ పైకి వెళతారని అంటున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ అనీ .. భారీ స్థాయిలో నిర్మితం కానున్న ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. పవన్ ను పాన్ ఇండియా స్టార్ గా త్రివిక్రమ్ పరిచయం చేయనుండటం పట్ల ఆయన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
Go Back to Shorts
Pavan kalyan
Trivikram Srinivas
Pan India Movie

More Telugu News