వరుసగా మూడో రోజు సీఎం జగన్‌కు రఘురామ లేఖ!
- పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాలపై లేఖ
- ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
- సాయాన్ని రూ.లక్షకు పెంచుతామన్నారు
పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాల విషయంలో జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ నేడు మరో లేఖ రాశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే పెళ్లికానుక సాయం పెంచుతామని వైసీపీ ఎన్నికలకు ముందు చెప్పిందని ఆయన తెలిపారు. ఈ సాయాన్ని రూ.లక్షకు పెంచుతామని ప్రకటించినట్లు గుర్తు చేశారు. దీంతో ప్రజల నుంచి వైసీపీకి మద్దతు లభించిందని, ఇప్పుడు ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని అన్నారు.