ప్రపంచవ్యాప్తంగా కాసేపు స్తంభించిన ఇంటర్నెట్!
- నిలిచిపోయిన ప్రముఖ సంస్థ వెబ్‌సైట్లు
- గరిష్ఠంగా గంటపాటు సేవల్లో అంతరాయం
- క్లౌడ్ సేవల కంపెనీ ‘ఫాస్ట్లీ’ సేవల్లో లోపమే కారణం
- తక్కువ రద్దీ ఉన్న మార్గాల ద్వారా కంటెంట్‌ను తరలించడమే ఫాస్ట్లీ పని
- వ్యాక్సినేషన్ నమోదుపైనా ప్రభావం
క్లౌడ్ ఆధారిత కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ ప్రొవైడర్ అయిన ఫాస్ట్లీ దీనిపై స్పందించింది. సమస్యను వెంటనే గుర్తించి సరిచేసినట్లు వెల్లడించింది. తక్కువ రద్దీ ఉన్న మార్గాల ద్వారా వెబ్‌సైట్‌లకు కంటెంట్‌ను తరలించి తద్వారా వినియోగదారులకు వేగంగా చేర్చడమే దీని పని. 2019లో ఐపీఓకి వచ్చిన ఈ సంస్థ మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లు. అమెజాన్ వెబ్ సర్వీస్ వంటి ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ఫాస్ట్లీ చాలా చిన్నది. అయినప్పటికీ పలు కీలక సంస్థలకు సేవలందిస్తోంది.
ఇక ఇంటర్నెట్ స్తంభించిన సమయంలో పలు సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేవల్ని కొనసాగించాయి. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ నమోదుపై సైతం దీని ప్రభావం పడింది.