మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా?: ఈటలపై గంగుల ఫైర్
- టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈటలకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు గుర్తుకు రాలేదా?
- ఆస్తులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరుతున్నారు
- ఆయన రాజకీయ సమాధిని ఆయనే కట్టుకున్నారు
హుజురాబాద్ నియోజకవర్గంలో బలంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీనే అని, ఈటల కాదని గంగుల అన్నారు. కేసీఆర్ మీద అభిమానంతోనే హుజురాబాద్ ప్రజలు ప్రతి సారి టీఆర్ఎస్ ను గెలిపించారని చెప్పారు. సీఎం కార్యాలయంలో బలహీనవర్గాలకు చెందిన ఐఏఎస్ అధికారులు లేరు.... అందువల్ల తాను మంత్రిగా ఉండబోనని గతంలో ఈటల ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఈటల ఆయన రాజకీయ సమాధిని ఆయనే కట్టుకున్నారని చెప్పారు.