బెయిల్ షరతులను ఉల్లంఘించలేదు: సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన జగన్
- రఘురామ పిటిషన్ విచారణకు అర్హత లేదు
- వ్యక్తిగత, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే యత్నం
- న్యాయ వ్యవస్థను వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
- రఘురామ పిటిషన్‌ను కొట్టివేయాలి
ఇటీవల కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరిన జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు ఈ రోజు కౌంటర్ దాఖలు చేసి తమ అభిప్రాయాలు తెలిపారు. తాను బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని జగన్ చెప్పారు. రఘురామ పిటిషన్‌కు అర్హత లేదని కౌంటర్‌లో ఆయన పేర్కొన్నారు.
వ్యక్తిగత, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. రఘురామ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. కోర్టులో విచారణ కొనసాగుతోంది.