బీజేపీ ఎంపీ రంజిత కారుపై రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి.. వీడియో ఇదిగో
- రాజస్థాన్లోని భరత్పూర్ కు ప్రాతినిధ్యం వహిస్తోన్న రంజిత
- ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన
- దాడి చేసిన వారిని వదిలిపెట్టనన్న రంజిత
కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎంపీ అనుచరులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు. రంజిత సురక్షితంగా బయటపడ్డారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని ఆమె హెచ్చరించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆమె చెప్పారు. రాత్రి సమయంలో దాడి జరగడంతో నిందితులను గుర్తించలేకపోయానని తెలిపారు.