మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- నిన్న రూ. 48,062 వద్ద ముగిసిన బంగారం ధర
- నేడు పది గ్రాములకు రూ. 527 పెరిగిన వైనం
- వెండి ధర కిలోకు రూ.1,043 పెరుగుదల
ఔన్సు బంగారం ధర 1,908 డాలర్లుగా ఉండగా, వెండి ధర ఔన్సుకు 28.07 డాలర్లుగా ఉంది. హైదరాబాద్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50,700గా ఉంది. డాలర్ సూచీ ఐదు నెలల కనిష్ఠానికి పడిపోవడానికి తోడు యూఎస్ 10 ఇయర్ ట్రెజరీ ఈల్డ్స్ 1.56 శాతం తగ్గడంతో మదుపరులు బంగారంపై పెట్టుబడికి మొగ్గుచూపారు. ఫలితంగా పసిడి ధరలు ఎగబాకాయి.