5 వేలు, 10 వేలు డబ్బులు ఇచ్చి దాన్నే అభివృద్ధి అనుకోవడం జగన్ అవివేకం: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

రెండేళ్ల జగన్ పాలనలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి శూన్యమని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ప్రజలకు రూ. 5 వేలు, రూ. 10 వేలు ఇచ్చి అదే అభివృద్ధి అనుకోవడం జగన్ అవివేకమని అన్నారు. సంక్షేమం పేరుతో ఓవైపు డబ్బులు వేస్తూ.. మరోవైపు ప్రజలపై రెండింతల అధిక పన్నుల భారాన్ని మోపుతూ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

మద్యం, ఇసుక మాఫియాలను పోషిస్తున్నారని... బినామీలకు వేల కోట్లను దోచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. పేదలకు ఇళ్లపట్టాల పేరుతో ఒక సెంటు భూమిని ఇస్తున్నామనే పేరుతో... మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అక్రమంగా కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు.


More Telugu News