'గరుడ వేగ' దర్శకుడితో వరుణ్ తేజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గరుడ వేగ' దర్శకుడితో వరుణ్ తేజ్!

Varun Tej upcoming movie with Praveen Sattaru
  • వరుణ్ తేజ్ బాక్సర్ గా 'గని'
  • భార్యా బాధితుడిగా 'ఎఫ్ 3'
  • ప్రవీణ్ సత్తారుకు గ్రీన్ సిగ్నల్    
వరుణ్ తేజ్ పక్కా ప్లానింగుతో ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన 'గని' సినిమా చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగు గ్యాప్ లో 'ఎఫ్ 3' షూటింగులో పాల్గొననున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, వచ్చేనెల నుంచి మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. కరోనా కారణంగా 'గని' షూటింగు ఆగిపోయింది. అదే కారణంగా 'ఎఫ్ 3' వచ్చే నెలలో తదుపరి షెడ్యూల్ ను జరుపుకోనుంది. దాంతో ప్రస్తుతం వరుణ్ తేజ్ ఇంటిపట్టునే ఉంటున్నాడు.

ఈ సమయాన్ని వృథా చేయకూడదని భావించిన వరుణ్ తేజ్, తరువాత సినిమాను లైన్లో పెట్టే పనిని గట్టిగానే చేశాడట. అలా ప్రవీణ్ సత్తారు కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఆయన వినిపించిన కథ కొత్తగా అనిపించడంతో వెంటనే ఓకే అనేశాడని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు .. నాగార్జున హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత వరుణ్ తేజ్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని అంటున్నారు. ఈ లోగా వరుణ్ తేజ్ తన చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులను పూర్తి చేస్తాడన్న మాట.
Varun Tej
Ghani Movie
Kiran Korrapati
Praveen Sattaru

More Telugu News