10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన తెలంగాణ సర్కారు
- ఈ నెల 21 నుంచి గ్లోబల్ టెండర్ల దాఖలుకు అవకాశం
- బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీ
- 6 నెలల్లో 10 మిలియన్ డోసులు సరఫరా చేయాలి
- నెలకు 1.5 మిలియన్ డోసులు విధిగా సరఫరా చేయాలని షరతు
బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీగా ప్రకటించింది. అయితే, ఆరు నెలల్లో 10 మిలియన్ డోసుల వాక్సిన్లను సరఫరా చేయాల్సి ఉంటుందని షరతు విధించింది. నెలకు 1.5 మిలియన్ డోసులు విధిగా సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పింది. తెలంగాణలో వ్యాక్సిన్లు తీసుకునే అర్హత ఉన్న వారందరికీ వేయాలని ఇప్పటికే సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది.