అమెరికాలో 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి అనుమతి
- పిల్లలకు ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వ్యాక్సిన్
- అత్యవసర వినియోగానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోద ముద్ర
- ఇప్పటికే ప్రయోగాలు విజయవంతం
దీంతో 12 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ వయసు ఉన్న పిల్లలపై చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వారిపై ఆ వ్యాక్సిన్ సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేసినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ వేయడానికి నిర్ణయం తీసుకుని తమ దేశం కీలక ముందడుగు వేసిందని ఎఫ్‌డీఏ తాత్కాలిక కమిషనర్ జానెట్ వుడ్‌కాక్ వ్యాఖ్యానించారు.