హనుమంతుడి జన్మస్థలం విషయంలో టీటీడీ వర్సెస్ శ్రీహనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్టు!
- ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రేనన్న టీటీడీ
- ఖండిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన జన్మభూమి తీర్థ ట్రస్ట్
- కాదని నిరూపించాలని సవాలు విసురుతూ లేఖ రాసిన టీటీడీ
టీటీడీ పండిత పరిషత్ నాలుగు నెలలపాటు శోధించిన అనంతరం పౌరాణిక, శాసన, భౌగోళిక ఆధారాలతోనే ఈ ప్రకటన చేసినట్టు ఆ లేఖలో వివరించారు. అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని శాస్త్రీయంగా నిరూపించే సంక్షిప్త నివేదికను సమర్పించామని పేర్కొన్నారు. నివేదికలో పేర్కొన్న ఆధారాలు, ప్రమాణాలు అసత్యాలని ట్రస్టు వ్యవస్థాపకులు నిరూపించాలని సవాలు విసిరారు. తగిన ఆధారాలతో ఈ నెల 20లోపు
నివేదికను సమర్పించాలని కోరారు. అంతేకాదు, టీటీడీపై చేసిన దూషణలకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.