స్కానింగ్‌లో ఏడుగురు శిశువుల గుర్తింపు.. చివరికి తొమ్మిది మందికి జన్మనిచ్చిన మహిళ!
- పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో ఘటన
- అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఏడుగురు ఉన్నట్టు గుర్తింపు
- మొరాకో తరలించి సిజేరియన్ చేసిన వైద్యులు
- తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారన్న ఆరోగ్య మంత్రి
మొత్తం తొమ్మిదిమందికి ఆమె జన్మనివ్వగా వారిలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని మాలి ఆరోగ్య మంత్రి ఫంటా సిబీ తెలిపారు. మొరాకో, మాలిలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ఏడుగురు శిశువులే ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అయితే, సిజేరియన్ సమయంలో మరో ఇద్దరు కనిపించడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి జననాల్లో నవజాత శిశువుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పర్యవేక్షిస్తున్నారు.