ఈటల అధీనంలో ఉన్న భూములను పరిశీలిస్తోన్న అధికారులు
- దేవరయంజాల్ గ్రామంలోని భూముల సందర్శన
- గోదాంలను పరిశీలించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్
- సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూముల పరిశీలన
అక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధీనంలో ఉన్న భూముల్లోని గోదాంలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతితో పాటు రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. అలాగే, సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూములను పరిశీలిస్తున్నారు. ఈటల కబ్జా ఆరోపణలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు, ఈటల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించి తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరిన విషయం తెలిసిందే.