ఈటెల రాజేందర్ వ్యవహారంపై విచారణకు కేసీఆర్ ఆదేశం.. విజయశాంతి స్పందన!
- ఈటలపై భూకబ్జా ఆరోపణలు
- బలహీనవర్గాలను దొర కుటుంబం అణచివేస్తోందన్న విజయశాంతి
- దొర అహంకారపు ధోరణుల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభిస్తుంది
లక్ష కోట్లు మింగిన ఈ దొర కుటుంబం బడుగు, బలహీనవర్గాలపై చేస్తున్న అణచివేతల ప్రక్రియలో తమ్ముడు ఈటల రాజేందర్ గారిది మరో దుర్మార్గమని విజయశాంతి విమర్శించారు. ఈ దొర అహంకారపు ధోరణుల నుంచి తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తి తప్పక లభించి తీరుతుందని అన్నారు. మరోవైపు కాసేపట్లో ఈటల రాజేందర్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఆయన ఏం చెప్పబోతున్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.