కరోనా కట్టడికి సైన్యానికి ప్రత్యేక ఆర్థిక అధికారాలు!
- రక్షణశాఖ కీలక నిర్ణయం
- మూడు నెలల పాటు అమల్లో ఉండనున్న అధికారాలు
- చికిత్స, క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం
- వైద్య సామగ్రి సమకూర్చుకునే వెసులుబాటు
- ఎలాంటి అనుమతులు అవసరం లేదు
తాజా అధికారాలతో కరోనా చికిత్సా కేంద్రాలు, క్వారంటైన్ కేంద్రాలు నెలకొల్పడం, కావాల్సిన వనరుల్ని సమకూర్చుకోవడం సహా ఇతర అత్యవసర చర్యలు ఎలాంటి అనుమతులు లేకుండా స్వతహాగా చేపట్టేందుకు సైన్యానికి అవకాశం లభిస్తుంది. ఇకపై కార్ప్స్/ఏరియా కమాండర్లు రూ.50 లక్షలు, డివిజన్/సబ్ ఏరియా కమాండర్లు రూ.20 లక్షల వరకు కరోనా కట్టడి చర్యలు, ఇతర సహాయక చర్యల నిమిత్తం వినియోగించేందుకు అధికారం ఉంటుంది.
ఈ అధికారాలు మే 1 నుంచి జులై 31 వరకు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయి. గతంలో సైనిక వర్గాల్లోని వైద్యాధికారులకు కల్పించిన అత్యవసర అధికారాలను మరింత మందికి పొడిగిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ తొలి దశ విజృంభణ సమయంలోనూ కేంద్రం ఈ తరహా అధికారాలను కల్పించింది.