బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడాన్ని నిషేధించిన శ్రీలంక
- 2019లో తావీద్ జమాత్ ఆత్మాహుతి దాడి
- 11 మంది భారతీయులు సహా 270 మంది మృతి
- బురఖాలు ధరించి పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు
- కేబినెట్ తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించిన వెంటనే చట్టంగా మార్పు
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే ముసుగులు ధరించరాదని తీసుకున్న నిర్ణయాన్ని నిన్న మంత్రి మండలి ఆమోదించింది. కేబినెట్ నిర్ణయాన్ని పార్లమెంటు ఆమోదించిన వెంటనే చట్టంగా మారుతుంది. అయితే, కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.