రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఆంక్షలు.. రోజుకు రూ.300 కోట్లకుపైగా నష్టం
- కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు రవాణాపై ఆంక్షలు
- అత్యవసర సేవలు, రవాణాకు మాత్రమే అనుమతి
- ట్రక్కులకు పడిపోయిన డిమాండ్
- టోల్, రోడ్డు పన్నుల నుంచి మినహాయింపునకు డిమాండ్
రాష్ట్రాలు అత్యవసర సేవలు, రవాణాకు మాత్రమే అనుమతినిస్తున్నాయని, దీంతో ఆహార వస్తువులు, ధాన్యం, వైద్య ఉపకరణాలు మాత్రమే సరఫరా అవుతున్నట్టు చెప్పారు. ఆటోమోటివ్ హబ్ అయిన మహారాష్ట్రకు రవాణా పూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఆంక్షల నేపథ్యంలో ట్రక్కు డ్రైవర్లు మరోమారు ఇబ్బందుల్లో కూరుకుపోయారని, కాబట్టి గతంలో ఇచ్చినట్టుగా టోల్, రోడ్డు పన్నుల నుంచి మినహాయిపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.