Devendra Fadnavis: నాకు కరోనా దొరికితే ఫ‌డ్నవీస్ నోటిలో వేసేవాడిని: శివసేన ఎమ్మెల్యే సంజ‌య్

షార్ట్స్‌లో చూడండి
త‌నకు కరోనా వైరస్ దొరికితే దాన్ని తీసుకెళ్లి మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర‌ ఫడ్నవీస్ నోటిలో వేసేవాడిన‌ని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యానించారు. మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ విప‌రీతంగా ఉన్న నేప‌థ్యంలో ఆ రాష్ట్ర సంకీర్ణ ప్ర‌భుత్వంపై ఇత‌ర పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే ప్ర‌భుత్వం క‌రోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలమైంద‌ని ఫ‌డ్న‌వీస్ విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టే క్ర‌మంలో శివసేన నేత సంజయ్ గైక్వాడ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయకుండా ప్ర‌తిప‌క్షాల‌ను విమ‌ర్శించ‌డంలో శివ‌సేన నేతలు బిజీగా అయిపోయారంటూ ఇందుకు సంబంధించిన వీడియోను ప‌లువురు పోస్ట్ చేస్తున్నారు.  

Go Back to Shorts
Devendra Fadnavis
Maharashtra
Shiv Sena
mla
Corona Virus

More Telugu News