చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రం... 719 కొత్త కేసులు, నలుగురి మృతి
- ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 31,719 కరోనా పరీక్షలు
- 3,495 మందికి పాజిటివ్
- 9 మంది మృతి
- 1,198 మందికి కరోనా నయం
ఇతర జిల్లాల విషయానికొస్తే గుంటూరు జిల్లాలో 501, విశాఖ జిల్లాలో 405, కృష్ణా జిల్లాలో 306 కేసులు గుర్తించారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 9,25,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,97,147 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 20,954 మంది చికిత్స పొందుతున్నారు.