గత తొమ్మిదేళ్లలో పాకిస్థాన్‌లో పర్యటించిన తొలి రష్యా మంత్రిగా సెర్గీ లవ్రోవ్
- రెండు రోజుల పర్యటన నిమిత్తం పాక్ చేరుకున్న రష్యా విదేశాంగ మంత్రి
- ఆఫ్ఘాన్ శాంతి ప్రక్రియలో రష్యా పోషిస్తున్న పాత్రకు పాక్ ప్రశంస
- ఉగ్రవాదం అణచివేతకు ఆయుధాలిస్తామన్న రష్యా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌కు సాయం చేస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఆయుధాలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ ఆప్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియలో రష్యా పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు. రష్యా-పాకిస్థాన్ మధ్య గ్యాస్ పైప్‌లైన్‌కు సంబంధించిన అంశంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రష్యా విదేశాంగ మంత్రి ఒకరు పాకిస్థాన్‌లో పర్యటించడం గత 9 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.