శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. సర్పంచ్ కుటుంబం దుర్మరణం
- నిడమనూరు వద్ద ప్రమాదం
- టాటా ఏస్‌ను ఢీకొట్టిన లారీ
- బైక్‌పైకి దూసుకెళ్లిన టాటా ఏస్
- పరారీలో లారీ డ్రైవర్
దీంతో బైక్‌పై ఉన్న తెప్పలమడుగు సర్పంచ్ తరి శ్రీనివాస్ (34), అతడి భార్య విజయ (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఐదేళ్ల వారి కుమార్తె శ్రీవిద్య, మూడేళ్ల కుమారుడు కన్నయ్య, టాటా ఏస్‌లో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ, సర్పంచ్ పిల్లలు ఇద్దరూ మృతి చెందారు.
తన భార్య విజయ పుట్టింట్లో శుభకార్యం ఉండడంతో ముప్పరం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.