ఎస్బీఐ ఫిర్యాదు.. ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ ఎఫ్ఐఆర్
- వ్యాపారం కోసం బ్యాంకు నుంచి రూ. 237.84 కోట్ల రుణం
- తీసుకున్న రుణాన్ని అక్రమంగా దారి మళ్లించారన్న అభియోగాలు
- రఘురామకు చెందిన పవర్ జనరేషన్ కంపెనీ, దాని 9 మంది డైరెక్టర్లపైనా కేసులు
నిందితులందరూ కుమ్మక్కై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటు ఫోర్జరీ పత్రాలను అసలైనవిగా చూపించడం తదితర నేరాలకు పాల్పడినట్టు ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకున్న రుణాలను కుట్ర పూరితంగానే దారి మళ్లించారని అందులో పేర్కొంది.