కరోనా భయాలు.. తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేత!
- తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- విద్యాసంస్థల్లో పెద్ద సంఖ్యలో కరోనా విస్తరణ
- విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన
అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సబిత, విద్యాశాఖ ఉన్నతాధికారులు, వైద్యశాఖ అధికారులు చర్చలు జరిపారు. విద్యాసంస్థల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న అంశంపై చర్చించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించిన ముఖ్యమంత్రి... విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. సీఎం నిర్ణయం మేరకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి.