నాటి స్ఫూర్తితో విశాఖ ఉక్కు కోసం పోరాడదాం: ఆర్.నారాయణమూర్తి
- విజయవాడలో విశాఖ ఉక్కుపై కార్టూన్, చిత్రలేఖన ప్రదర్శన
- నాటి పోరాట ఘట్టాలను వివరించిన నటుడు
- ప్రాణత్యాగం చేసిన వారిని మననం చేసుకున్న నారాయణమూర్తి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన పోరాటాన్ని వివరించారు. కర్మాగారాన్ని ఎలా సాధించుకున్నదీ చెబుతూ, నాటి పోరాట ఘట్టాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఈ సందర్భంగా నాటి పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకున్నారు. నేడు అదే స్ఫూర్తితో కంపెనీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నారాయణమూర్తి అన్నారు.