Pushpa: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో విలన్ ఎవ‌రో చెప్పేసిన సినీ యూనిట్!

mythri unit unveils pushpa movie vilan poster
షార్ట్స్‌లో చూడండి
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా  పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప' రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో కలపను అక్ర‌మంగా రవాణా చేసే లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో విల‌న్ ఎవ‌రన్న విష‌యాన్ని ఆ సినిమా యూనిట్ ఈ రోజు ప్ర‌క‌టించింది.  

మలయాళ నటుడు ఫవాద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు చెబుతూ ఆయ‌న ఫొటోను మైత్రిమూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నట్టు అప్ప‌ట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్టు నుంచి విజ‌య్ సేతుప‌తి తప్పుకున్న విష‌యం తెలిసిందే.

కేర‌ళ‌లో అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. అందుకే ఈ సినిమా కోసం మ‌ల‌యాళ న‌టుడినే విల‌న్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బ‌న్నీ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తోన్న ఈ సినిమా ఆగ‌స్టు 13న విడుద‌ల కానుంది. 
Go Back to Shorts
Pushpa
Allu Arjun
Tollywood
sukumar

More Telugu News