అంబానీ ఇంటివద్ద దొరికిన పేలుడు పదార్ధాలు అంత తీవ్రమైనవి ఏం కాదు.. ఫోరెన్సిక్ ల్యాబ్ వెల్లడి
- జిలెటిక్ స్టిక్స్ స్వల్ప పేలుడు తీవ్రత కలిగినవే
- అమ్మోనియం నైట్రేట్ వినియోగం
- రెండు రోజుల్లో ఎన్ఐఏకు నివేదిక
- హిరేన్ మృతి, వాహనంపైనా కొనసాగుతున్న దర్యాప్తు
అలాగే వాహనం యజమాని ఎవరు, దీని రిజిస్టర్డ్ నెంబర్ మార్చారా అన్న విషయాలపై కూడా తాము దర్యాప్తు చేస్తున్నామని అధికారి తెలిపారు. వాహనంలో ఏవైనా రక్తపు మరకలు, వెంట్రుకల వంటి ఆనవాళ్ల కోసం వెతుకుతున్నామని వెల్లడించారు. డ్రైవింగ్ ఎవరు చేసి ఉంటారనే అంశాన్ని కూడా విచారిస్తున్నామని తెలిపారు. వీటన్నింటి ద్వారా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
మరోవైపు ఈ వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ మృతదేహం థానేలోని ఓ కాలువలో కనుగొన్న విషయం తెలిసిందే. అయితే, అతనికి ఎవరైనా డ్రగ్స్ ఇచ్చారా అన్న కోణంలోనూ ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని హిరేన్ భార్య విమల పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని ఆమె ఆరోపించారు. కాగా, ఈ కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను ఎన్ఐఏ అధికారులు నిరంతరాయంగా విచారిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం అంబానీ ఇంటి వద్దకు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.