కొడాలి నానిపై వర్ల రామయ్య, జవహర్ తీవ్ర విమర్శలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొడాలి నానిపై వర్ల రామయ్య, జవహర్ తీవ్ర విమర్శలు

Varla and Jawahar fies on Kodali Nani
  • నాని సభ్యత, సంస్కారాలతో పెరగలేదన్న వర్ల
  • నాని ఒక దద్దమ్మ అన్న జవహర్
  • చంద్రబాబుపై దుర్భాషలాడటం మానుకోవాలని హితవు
మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, జవహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని సభ్యత, సంస్కారాలతో పెరగలేదని అన్నారు. చంద్రబాబు కేసులో హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను చదువుకోలేని కొడాలి నాని మాట్లాడటం శోచనీయమని అన్నారు. రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేని కొడాలి మంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలకు సిగ్గుచేటని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు.

జవహర్ మాట్లాడుతూ, కొడాలి నాని ఒక దద్దమ్మ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై అవాకులు, చెవాకులు పేలడం మానుకోవాలని అన్నారు. జగన్ బెయిలు గురించి నాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికి నాని ఎంత దారుణంగానైనా మాట్లాడతారని చెప్పారు. నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు.
Kodali Nani
YSRCP
Jawahar
Varla Ramaiah

More Telugu News