భారత్ చేరుకున్న అమెరికా రక్షణ మంత్రి
- మూడు రోజుల పర్యటన
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ
- అజిత్ దోవల్, జైశంకర్‌తోనూ సమావేశమయ్యే అవకాశం
- ఇండో-పసిఫిక్ ప్రాంతం, ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియ వంటి అంశాలపై చర్చ
ఈ పర్యటనలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ లాయిడ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పదవి చేపట్టిన తర్వాత ఆయన కేబినెట్‌లోని ఓ ఉన్నతాధికారి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పైగా చైనాతో భారత్ సంబంధాలు క్షీణించిన వేళ ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేయాలని ఇటీవల జరిగిన క్వాడ్ సదస్సులో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన దాని కొనసాగింపుగానే జరుగుతోందని భావిస్తున్నారు.