అబ్బాయిల‌ను త‌ల‌ద‌న్నేలా బైక్‌పై ఇద్ద‌రమ్మాయిల విన్యాసం.. జ‌రిమానా వడ్డించిన అధికారులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అబ్బాయిల‌ను త‌ల‌ద‌న్నేలా బైక్‌పై ఇద్ద‌రమ్మాయిల విన్యాసం.. జ‌రిమానా వడ్డించిన అధికారులు!

police fines girl
  • సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉండే శివంగి దబాస్
  • రెజ్లర్‌ స్నేహ రఘువన్షితో కలిసి బైక్ పై విన్యాసాలు
  • స్నేహ బైక్ న‌డుపుతుండ‌గా ఆమె భుజాలపై కూర్చున్న వైనం
ఇద్ద‌రు అమ్మాయిలు అబ్బాయిల‌ను త‌ల‌ద‌న్నేలా బైక్ పై విన్యాసాలు చేయ‌డంలో ఆరితేరారు. అయితే, వారు ప్ర‌జ‌లు న‌డిచే రోడ్ల‌పై ప్రమాద‌క‌ర‌రీతిలో, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా విన్యాసాలు చేయ‌డంతో ఫైన్ ప‌డింది.  శివంగి దబాస్ సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. బైక్‌ల‌పై ఆమె చేసే విన్యాసాల‌కు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతుంటారు.

అయితే, ఆమె ఇటీవ‌ల‌ రెజ్లర్‌ స్నేహ రఘువన్షితో కలిసి ఓ బైక్ విన్యాసాన్ని చేసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసింది. రెజ్లర్ స్నేహ బైక్ న‌డుపుతుండ‌గా ఆమె భుజాలపై శివంగి కూర్చొని ఉండడం గ‌మ‌నార్హం. ఈ దెబ్బ‌కు త‌న ఫాలోవ‌ర్ల సంఖ్య పెరుగుతుంద‌ని, మ‌రింత ప‌బ్లిసిటీ వ‌స్తుం‌ద‌ని భావించింది.

అయితే, ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్ల‌డంతో ట్రాఫిక్‌ నియమ నిబంధనల్ని అతిక్రమించినందుకు రెజ్లర్‌ స్నేహ తల్లి మంజుదేవి ఇంటికి రూ.11 వేలు చలానా పంపారు. అంతేకాదు, ఆ అమ్మాయిల‌కు బైక్‌ ఇచ్చిన దాని యజమాని సంజయ్‌ కుమార్‌కు రూ.17 వేల జరిమానా విధించారు.
Police
Social Media
bike

More Telugu News