హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద మంటలు.. ట్రాఫిక్ జామ్
- ఫైబర్ డెకరేషన్‌కు మంటలు
- భయాందోళనలకు గురైన వాహనదారులు, స్థానికులు
- మంటలను అదుపు చేస్తోన్న అగ్నిమాపక సిబ్బంది
వాహనదారులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకుని అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, మూడు రోజుల క్రితమే పంజాగుట్ట ఫ్లై ఓవర్ కింద ఫైబర్ డెకరేషన్లోనే మంటలు అంటుకుని కలకలం చెలరేగింది. మళ్లీ అదే ప్రాంతంలో మంటలు అంటుకోవడం గమనార్హం. అక్కడ మంటలు చెలరేగుతోన్న ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.