అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు.. పోలీసు అధికారి అరెస్ట్
- అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు
- ముంబై అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు
- 12 గంటల విచారణ తరువాత అరెస్ట్
గత నెల 25న ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలను గుర్తించారు. అందులో ముకేశ్ భార్య నీతా అంబానీని హెచ్చరిస్తూ ఉన్న లేఖను కూడా గుర్తించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పేలుడు పదార్థాలు ఉంచిన వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆ వాహనం చోరీకి గురైనట్టు ఆయన అంతకుముందే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
అయినప్పటికీ ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ప్రభుత్వం కేసును ఎన్ఐఏకు అప్పగించింది. హిరేన్ మృతి వెనక సచిన్ వాజే హస్తముందన్నఆరోపణలు వెల్లువెత్తడంతో ఉద్ధవ్ ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. తాజాగా, ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేసింది.