మహేశ్ బాబు తదుపరి సినిమాలో కృతిశెట్టి?
- 'ఉప్పెన'తో పరిచయమైన కృతిశెట్టి
- నాని, రామ్ సినిమాలలో ఆఫర్లు
- అనిల్ రావిపూడి తో మహేశ్ సినిమా
- కృతిశెట్టికి దక్కనున్న ఛాన్స్
ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న మహేశ్.. దాని తర్వాత వాస్తవానికి రాజమౌళి దర్శకత్వంలో నటించాలి. అయితే, ఆ ప్రాజక్టుకు ఇంకా సమయం ఉన్నందున ఈ లోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ కూడా ఇటీవల సూచాయగా చెప్పాడు. ఇక ఇందులో కథానాయికగా కృతి శెట్టిని తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట. నిజంగానే ఇది కార్యరూపం దాలిస్తే కనుక, కృతి శెట్టి కెరీర్ తెలుగులో మరింత పుంజుకుంటుందనే చెప్పచ్చు!