Andhra Pradesh: ఏపీలో కొత్తగా 115 మందికి కరోనా పాజిటివ్

AP Corona Virus Cases Update
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 46,566 కరోనా పరీక్షలు నిర్వహించగా 115 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. చిత్తూరు జిల్లాలో 32 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 20, విశాఖ జిల్లాలో 18 కేసులు గుర్తించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 93 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 8,90,556 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,462 మంది కరోనా వైరస్ ప్రభావం నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 921 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,173కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Active Cases
Deaths
Update

More Telugu News