రాణించిన పంత్, సుందర్... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అధిగమించిన టీమిండియా

Team India crosses England first innings score
ప్రతికూల పరిస్థితుల్లో టీమిండియా మరోసారి దృఢసంకల్పం కనబర్చింది. అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను పంత్, వాషింగ్టన్ సుందర్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఇంగ్లండ్ బౌలింగ్ ను సమర్థంగా కాచుకోవడమే కాకుండా, విలువైన పరుగులు కూడా సాధించడంతో టీమిండియా కోలుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్  205 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరును కూడా అధిగమించి ఆధిక్యం దిశగా పయనిస్తోంది.

ప్రస్తుతం భారత్ స్కోరు 6 వికెట్లకు 245 పరుగులు కాగా.... పంత్ 89 పరుగులతోనూ, సుందర్ 38 పరుగులతోనూ ఆడుతున్నారు. భారత్ ఆధిక్యం 40 పరుగులకు చేరుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, స్టోక్స్, లీచ్ తలో రెండు వికెట్లు తీశారు. ఓ దశలో టీమిండియా 200 పరుగులు దాటడం కష్టమనిపించినా, పంత్, సుందర్ జోడీ పట్టుదలగా ఆడి ఇంగ్లండ్ బౌలింగ్ దాడులను నిలువరించింది.
Go Back to Shorts
Team India
England
Pant
Sundar
Ahmedabad

More Telugu News